ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..మిర్చి చరిత్రలోనే గరిష్ఠ ధర.. Red Chilli Price : మార్కెట్‌లో మిరప ధర మోత మోగుతోంది. ఈసారి మిర్చి పంట దిగుబడి తగ్గినా... ధరలు పెరగడంతో రైతులకు ఊరట లభిస్తుంది. హైదరాబాద్ మలక్‌పేటకు పెద్దమొత్తంలో మిరపకాయలు వస్తుండడంతో... మార్కెట్ కళకళలాడుతోంది. గుంటూరు, వరంగల్, ఖమ్మం మార్కెట్లతో సమానంగా... మిరప క్వింటాల్ కనిష్ఠంగా 8... గరిష్ఠంగా 22 వేలు ధర పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సినిమా టికెట్ల ధరకు శుభం కార్డు..!Chiranjeevi Comments: ఏపీ సీఎం జగన్ నిర్ణయం తమను ఎంతో సంతోష పరిచిందని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. టికెట్ ధరలకు సంబంధించి శుభం కార్డు పడినట్లు తాము భావిస్తున్నామని చెప్పారు. చిన్న సినిమాల ఐదోషోకు అనుమతించడం శుభపరిణామమని చెప్పారు. సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు.పదేళ్లుగా ఆఫీస్ రెంటు కట్టని కాంగ్రెస్.. Sonia Gandhi house rent pending: దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం, సోనియా గాంధీ అధికారిక నివాసం సహా మరికొందరు కాంగ్రెస్ నేతలు ఉంటున్న భవనాలకు అనేక ఏళ్లుగా అద్దె చెల్లించడం లేదని తెలిసింది. కాంగ్రెస్ ఆఫీసుకు సంబంధించి ప్రభుత్వానికి రూ.12.69లక్షలు బకాయి ఉన్నట్లు స.హ. చట్టం దరఖాస్తు ద్వారా తెలిసింది.కేంద్ర మంత్రి తనయుడికి బెయిల్..Ashish Mishra Bail: ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటన ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ వచ్చింది.'హిజాబ్' వివాదం కేసు బదిలీకి సుప్రీం నో.. Hijab Row Case: కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ అంశంపై విచారణను కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీ చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హిజాబ్ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుందని.. ఈ దశలో జోక్యం సరికాదని అభిప్రాయపడింది.కేరళలో మంకీ ఫీవర్ కలకలం...Monkey Fever in Kerala: కేరళలో మంకీ ఫీవర్ కలకలం రేపింది. వయనాడ్ జిల్లాలో ఓ యువకుడికి ఈ జ్వరం సోకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.మూఢనమ్మకానికి ఇది పరాకాష్ఠ.. Nail driven into woman's head: ఆమెకు ఇప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు. నాలుగో కాన్పులోనూ అమ్మాయే పుడుతుందని అనుమానం. అదే జరిగితే భర్త వదిలేస్తాడని భయం. అందుకే ఓ నకిలీ బాబాను ఆశ్రయించింది. అతడి సలహాతో తలకు మేకు కొట్టించుకుని ప్రాణం మీదకు తెచ్చుకుంది.క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ బ్యాండ్ బాజా..ICICI Credit Card: మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడే వారికి మరింత అప్రమత్తత అవసరం. తాజాగా ఈ బ్యాంకు ఛార్జీలను భారీగా పెంచింది. ఫిబ్రవరి 10న అమల్లోకి వచ్చాయి.కోహ్లీ చేతుల మీదుగా భారత్ క్యాప్.. కోహ్లీ చేతుల మీదుగా టీమ్ఇండియా క్యాప్ అందుకోవడం మర్చిపోలేని అనుభూతి అని దీపక్ హుడా చెప్పాడు. రోహిత్, ద్రవిడ్, కోహ్లీ లాంటి స్టార్స్‌తో డ్రస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు.కొత్త సినిమా ముచ్చట్లు..సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో శివకార్తికేయన్ తెలుగు సినిమా, కంగన రియాలిటీ షో ఫస్ట్‌లుక్, శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి.