ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..ట్రెండింగ్‌లో.. మోదీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ.. Modi Enemy Of Telangana: పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రదుమారం రేగుతోంది. రాష్ట్రంలో తెరాస, కాంగ్రెస్‌లు తీవ్రస్థాయిలో నిరసన వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెరాస మోదీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్లో ట్రెండ్ చేసింది.తెలంగాణ అభివృద్ధిపై మోదీకి కడుపుమంట..KTR Comments: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్.. ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్ కంటే అభివృద్ధి చెందుతున్నామని మోదీకి కడుపుమంటగా ఉందని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.తుమ్మల ఆసక్తికర కామెంట్లు.. Tummala Nageshwararao Comments: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో తుమ్మల పాల్గొన్నారు. అనంతరం ఆసక్తికర కామెంట్స్ చేశారు.కేసీఆర్, మోదీ కలిసే కొత్త నాటకాలు..Bhatti Comments: కాంగ్రెస్‌పై, విభజన తీరుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, సోనియాను విమర్శిస్తే ఊరుకునేది లేదని విరుచుకుపడ్డారు. కేసీఆర్, మోదీ కలిసి కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.రేపు జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ.. AP cm jagan tollywoods bigwigs meet UPDATE : ఏపీ సీఎం జగన్‌ను సినీ పరిశ్రమ ప్రముఖులు రేపు కలవనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. సినిమా టికెట్ల ధరపై చర్చించనున్నారు. చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు పాల్గొననున్నారు.కాంగ్రెస్ గెలిస్తే.. 20 లక్షల ఉద్యోగాలు..congress up manifesto: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్. తమను అధికారంలోకి తీసుకొస్తే రైతులకు రుణ మాఫీ, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.ఆరేళ్లుగా మొసలి మెడలో బైక్ టైర్.. బైక్ టైర్ మెడకు ఇరుక్కుని ఆరేళ్లుగా నరకం చూస్తున్న మొసలికి ఎట్టకేలకు విముక్తి లభించింది. ఓ యువకుడు స్థానికుల సాయంతో మొసలిని పట్టుకుని, టైరును తొలగించాడు.ఐటీ, ఆర్థిక షేర్ల జోరు..Stock Market Close: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 657 పాయింట్లు, నిఫ్టీ 197 పాయింట్లు లాభపడ్డాయి.అక్కడ ఫుట్‌బాల్ స్డేడియం.. Highest Football Stadium: దేశంలోనే అత్యంత ఎత్తైన, అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఫుట్‌బాల్ స్డేడియాన్ని లద్దాఖ్‌లో నిర్మించారు. ఇది సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తులో ఉండటం విశేషం.కొత్త సినిమా ముచ్చట్లు..Movie Updates: యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రంపై మరో అప్డేట్ వచ్చింది. మరోవైపు కింగ్ నాగార్జున వెబ్‌సిరీస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. ఇలా ఇంకా మరెన్నో ఆసక్తికర అప్డేట్స్ ఉన్నాయి.