ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..ఇది మోదీ కొత్త పొలిటికల్ డ్రామా.. Talasani Comments: పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. సందర్భమే లేని సమయంలో విభజన అంశంపై మాట్లాడటం.. తెలంగాణ, ఏపీలు తీవ్రంగా నష్టపోతున్నాయని చెప్పటం.. మోదీ తెరలేపిన కొత్త రాజకీయ డ్రామా అని అభివర్ణించారు.మోదీ క్షమాపణలు చెప్పాలి..Revanth Reddy Fire on PM Modi: ప్రధాని నరేంద్రమోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్లో మాట్లాడిన ప్రధానిపై ఆయన ధ్వజమెత్తారు. గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తికి తెలంగాణ సమాజం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం భాజపా నేతలు సెంటిమెంట్లను రెచ్చగొడుతుంటారని విరుచుకుపడ్డారు.మూడో దశ పూర్తిగా తగ్గింది.. DH on Corona Third Wave: రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోయిందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి కొవిడ్ ఆంక్షలు అమలులోలేవన్నారు. అన్ని సంస్థలు వందశాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.సింగరేణి కార్మికుల సమ్మె నోటీస్Singareni Strike: సింగరేణి కాలరీస్‌లో సమ్మె సైరన్ మోగింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికుల సమ్మె నోటీసిచ్చారు. టీబీజీకేఎస్, బీఎంఎస్, ఐఎన్‌టీయూసీ నేతలు సమ్మె నోటీసు అందించారు. దీనిపై హైదరాబాద్ ఆర్ఎల్సీ కార్యాలయంలో సింగరేణి సంఘాల నాయకులతో ప్రాంతీయ లేబర్ కమిషనర్ చర్చలు నిర్వహించారు. సమ్మె నోటీస్‌పై చర్చించారు.భిక్షాటన చేసే పాపపై.. Rape attempt on beggar: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కీచకుడు ఓ చిన్నారిపై బలాత్కారానికి తెగబడ్డాడు. భిక్షాటన చేస్తున్న పాప అని కూడా చూడకుండా.. మదమెక్కిన ఆంబోతులా ఆమెను చెరపబోయాడు. ఈ అమానవీయ ఘటన కామారెడ్డిలో జరిగింది.ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ..Meghalaya Congress News: మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలింది. ఆ పార్టీకి ఇప్పటివరకు మిగిలి ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు.. భాజపాతో కూడిన అధికార ఎండీఏలో చేరాలని నిర్ణయించుకున్నారు.ఆ కేసులో 49 మంది దోషులు.. Ahmedabad Bomb Blast Case: 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 49 మందిని దోషులుగా తేల్చింది గుజరాత్‌లోని ప్రత్యేక కోర్టు. ఈ కేసులో మొత్తం 77 మంది నిందితులను విచారించిన కోర్టు మరో 28 మందిని నిర్దోషులుగా పేర్కొంది.రోజంతా ఒడుదొడుకుల్లోనే సూచీలు..stock market closing today: భారత స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగాయి. మంగళవారం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అనంతరం భారీ నష్టాలు నమోదు చేశాయి. చివరకు కోలుకొని స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ముగించాయి.టీమ్ఇండియాకు గుడ్‌న్యూస్.. Dhawan Iyer: వెస్టిండీస్‌తో రెండో వన్డేకు ముందు టీమ్ఇండియాకు గుడ్‌న్యూస్. కరోనా బారినపడిన భారత క్రికెటర్లు శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్‌కు కొవిడ్ నెగెటివ్‌గా తేలింది.ఈ వారం రిలీజ్ అయ్యే చిత్రాలివే..Movies Releasing This Week: మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడీ', 'డీజే టిల్లు', 'గెహ్రాహియా' సహా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న పలు చిత్రాలు ఈ వారమే విడుదల కానున్నాయి. అవేంటో చూసేయండి.