తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA

By

Published : Feb 3, 2022, 4:58 PM IST

  • సీఎం కేసీఆర్ వ్యాఖ్యల్లో తప్పులేదు..

trs mps on bjp, congress: రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఏం చేసిందో భాజపా నేతలు చెప్పాలని తెరాస ఎంపీలు డిమాండ్‌ చేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని దిల్లీలో తెలిపారు.

  • స్వర్ణోత్సవాలకు సిద్ధమైన ఇక్రిశాట్​..

Icrisat PM visit: స్వర్ణోత్సవ సంబురాలకు ఇక్రిశాట్ సిద్ధమైంది. హైదరాబాద్​ నగర శివారు పటాన్​చెరులో ఏర్పాటైన ఇక్రిశాట్​.. ఫిబ్రవరి 5న జరుపుకొంటున్న 50 ఏళ్ల ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ క్రమంలో మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా దళాలు ముందస్తుగా ఏరియల్​ సర్వే నిర్వహించాయి.

  • పోలీస్ సమయస్ఫూర్తితో రోగి ప్రాణాలు సేఫ్..

Traffic Police saves patient life: ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ రోగి పాలిట ఆపద్బాంధవుడిగా మారారు. సమయస్ఫూర్తి ప్రదర్శించి అతడి ప్రాణాలను నిలబెట్టారు. దారి మధ్యలో టైరు పంక్చరయిన ఓ అంబులెన్సుకు టైరు మార్చి మానవత్వాన్ని చాటారు.

  • నకిలీ కొవిషీల్డ్​ టీకాలతో దందా..

Fake Covid Vaccine: కరోనా నకిలీ టీకాలను తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు యూపీ పోలీసులు. వారి నుంచి నకిలీ కొవిషీల్డ్​, జైకొవ్​-డి వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్స్​ను స్వాధీనం చేసుకున్నారు.

  • కార్ హెడ్ లైట్స్​ వెలుగులో పరీక్ష..

Bihar Inter Exam 2022: మధ్యాహ్నం 1.45కు మొదలు కావాల్సిన పరీక్ష సాయంత్రం నాలుగున్నరకు ప్రారంభమైంది. కాసేపటికే చీకటి పడిపోయింది. పరీక్ష కేంద్రంలో లైట్లు లేవు. అధికారులు కార్ల​ హెడ్​ లైట్స్​తో 'వెలుగు' నింపగా.. విద్యార్థులు అలానే పరీక్ష పూర్తి చేశారు. బిహార్ మోతిహరి జిల్లాలో మంగళవారం జరిగిందీ ఘటన.

  • సిరియాలో అమెరికా మెరుపు దాడి..

Syria children killed in US attack: సిరియాలో ఉగ్రమూకలే లక్ష్యంగా అమెరికా దళాలు జరిపిన దాడిలో 13 మంది పౌరులు మరణించారు. ఇందులో ఆరుగురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు.

  • తగ్గిన ఫేస్​బుక్ యూజర్ల సంఖ్య..

Facebook Losses Daily Users: 18 ఏళ్ల చరిత్రలో ఫేస్‌బుక్‌ వినియోగదారుల సంఖ్య తొలిసారిగా తగ్గింది. డిసెంబర్‌తో ముగిసే త్రైమాసికానికి ఈ సంఖ్య 192 కోట్ల 90 లక్షలకు పడిపోయింది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది 193 కోట్లుగా ఉంది. ఫలితంగా ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా షేర్లు 20 శాతం మేర నష్టపోయాయి.

  • వరుస లాభాలకు బ్రేక్..

Stock Market Close: స్టాక్​ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 770 పాయింట్లు కోల్పోయి 58,788 వద్దకు దిగజారింది. నిఫ్టీ 219 పాయింట్లు క్షీణించి 17,560 పాయింట్ల వద్ద స్థిరపడింది.

  • కేఎల్​ రాహుల్​ ఇంట్లో పెళ్లి బాజాలు..

KL Rahul News: టీమ్​ఇండియా వైస్​ కెప్టన్​ కేఎల్​ రాహుల్​ విండీస్​తో తొలి వన్డేకు దూరమయ్యాడు. రాహుల్​ ఇంట త్వరలో పెళ్లి వేడుకలు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆ పనుల్లో రాహుల్​ బిజీగా ఉన్నాడని సమాచారం.

  • 'ఆర్ఆర్ఆర్' రిలీజ్​కు కౌంట్​డౌన్..

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్ఆర్ఆర్, మహాన్, గంగూబాయ్ కతియావాడి చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details