ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..మోదీ హైదరాబాద్ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. CS Somesh Review PM Tour: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం సహా ముచ్చింతల్‌లోని జీయర్ ఆశ్రమంలో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా.. సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖలన్నీ పూర్తి సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేసి.. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. కరోనా ప్రోటోకాల్స్‌ను పూర్తి స్థాయిలో పాటించాలని సూచించారు.పేదలకు మెరుగైన సేవలే లక్ష్యంగా.. Harish Rao Inaugurated Hospitals: మేడ్చల్‌లో 100 పడకలతో నూతనంగా ఏర్పాటు చేసిన మెడినోవా ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ మియాపూర్‌లో మరో సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్ పాల్గొన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు హరీశ్ పేర్కొన్నారు.వైభవోపేతంగా సహస్రాబ్ది ఉత్సవాలు.. Statue of Equality Inauguration Celebrations : భక్తులు, వేద పండితుల శ్రీమన్నారాయణ నామస్మరణతో మొదలైన శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు రెండో రోజు కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా అగ్నిమథనం పూర్తి అయింది. ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చింతల్‌కు వెళ్లనున్నారు. మరోవైపు ఈ నెల 5న ప్రధాని మోదీ.. వస్తున్నందున శ్రీరామనగరంలోని జీవా ప్రాంగణంలో అధికారులు హెలికాప్టర్ ట్రయల్స్ నిర్వహించారు.నిర్భంధాలను ఛేదించుకుని విజయవాడకు.. Chalo Vijayawada Updates : చలో విజయవాడకు రాకుండా అడుగడుగునా నిఘాపెట్టి నిర్బంధాలు చేసినా.. తమ కొత్త పీఆర్సీ పై తమ ఆగ్రహాన్ని ఆక్రోశాన్ని చాటారు ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులు. ఒక్కసారిగా.. వేలాదిగా తరలివచ్చి ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.మంత్రిపై దాడికి యత్నం.. UP election 2022: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్‌పై దాడికి యత్నించాడు ఓ దుండుగుడు. ఆయన భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దుండగుడి నుంచి పదునైన ఆయుధం, ఓ విషం బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఆ దేశాలతో భారత్‌కు ముప్పు.. Army Chief On Future Conflicts: శత్రుదేశాలతో భద్రతాపరమైన సవాళ్లపై భారత సైనిక దళాధిపతి ఎం.ఎం.నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, చైనా నుంచి ముప్పు పొంచి ఉందని, ఇప్పటికే అందుకు సంబంధించిన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.విద్యార్థుల జీవితాలతో ఆడుకోలేం.. Supreme court on GATE: గేట్-2022 పరీక్ష యథాతథంగా జరగనుంది. కరోనా కారణంగా పరీక్షను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీకోర్టుం తిరస్కరించింది.చిన్నారులపై లైంగిక వేధింపులా.. Pocso e-box : చిన్నారులపై లైంగిక వేధింపుల్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. రోజురోజుకీ సమాజంలో పెరుగుతున్న ఆకతాయిల ఆకృత్యాలను అడ్డుకునేందుకు అవగాహన లోపమే ప్రధాన సమస్యగా మారింది. దీనిపై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని పిల్లలకు అవగాహన కల్పించాల్సి ఉంది. వీటిపై ఫిర్యాదుల నమోదు కోసం పోక్సో చట్టం అమల్లో భాగంగా పోక్సో ఈ-బాక్స్ యాప్‌కు రూపకల్పన జరిగింది.ఐపీఎల్ వేదికపై గంగూలీ కీలక ప్రకటన.. IPL 2022 venue ganguly: ఈ ఏడాది ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. అయితే ఈ నిర్ణయం.. లీగ్ సమయానికి ఉన్న కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని అన్నాడు.పునీత్ ఫ్యామిలీని పరామర్శించిన బన్నీ.. Puneeth Rajkumar Alluarjun: గతేడాది గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబసభ్యుల్ని ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పరామర్శించారు. పునీత్ మరణం పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.