తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA

By

Published : Feb 1, 2022, 4:59 PM IST

  • మహేష్ బ్యాంకు హ్యాకింగ్ కేసులో పురోగతి..

Mahesh Bank hacking case: మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాకింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీళ్లలో ఇద్దరు నైజీరియన్లతో పాటు ఒక మహిళ ఉన్నారు. వీళ్లను దిల్లీలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చి చంచల్​గూడ జైలుకు రిమాండ్ తరలించారు.

డ్రగ్స్​ కేసులో 9 మందికి బెయిల్..

పంజాగుట్ట మాదక ద్రవ్యాల కేసులో 9 మందికి బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. టోనీ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి వినియోగించిన కేసులో 9 మందిని గత నెల 20న పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీకి ఇవ్వాలని హైకోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్​ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో వారు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

  • పోలీసులను చంపేందుకు మావోయిస్టుల కుట్ర..

SP Sangram Singh: పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టులు పన్నిన కుట్రను పోలీసులు తిప్పికొట్టారు. నాగారం మండలంలోని దొడ్ల గ్రామసమీపంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. మావోయిస్టుల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను హతమార్చేందుకే కుట్రపన్నారని.. ఎస్పీ సంగ్రాంసింగ్ వెల్లడించారు.

  • నవ భారత్​ కోసం 'బూస్టర్​ డోస్​' బడ్జెట్..

Union budget 2022: అంచనాలు తారుమారయ్యాయి. కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ప్రజాకర్షక పథకాలు, సామాన్యులపై వరాల జల్లు ఉండొచ్చన్న విశ్లేషణలు తలకిందులయ్యాయి. సంక్షేమ మంత్రం జపించడం కన్నా... ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించడానికే ప్రాధాన్యం ఇచ్చింది నిర్మలా సీతారామన్ బడ్జెట్. వృద్ధికి ఊతం, ఉపాధి కల్పనే లక్ష్యంగా మౌలిక వసతుల రంగానికి భారీగా నిధులు కేటాయించింది. కానీ.. ఆదాయ పన్ను స్లాబులు, రేట్లు యథాతథంగా కొనసాగించి.. సగటు వేతనజీవికి నిరాశే మిగిల్చింది.

  • సామాన్యుడి ఆశలకు అనుగుణంగా..

Budget 2022: ప్రజలందరి అభీష్టానికి అనుగుణంగా బడ్జెట్ ఉందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సామాన్యుడి ఆశలకు రెక్కలు తొడిగిందని చెప్పారు. ప్రగతిశీల బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు అభినందనలు తెలిపారు.

  • దేవుడిపై కోపంతో విగ్రహాలు ధ్వంసం..

Idol Demolition in Delhi: తమ కుటుంబంపై దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయని విగ్రహాలను ధ్వంసం చేశాడో యువకుడు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో జరిగింది.

  • 3 నిమిషాల్లో 204 స్ట్రైక్​లు..

Knee Striker Sachin Behera: ఒడిశాకు చెందిన స్ట్రైకర్ సచిన్ బెహెరా మరోసారి గిన్నిస్ బుక్ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్నాడు. నౌపడా జిల్లాకు చెందిన సచిన్.. కాళ్లకు ఐదు కిలోల బరువు కట్టుకుని మోకాళ్లతో అత్యధిక స్ట్రైక్​లు చేశాడు. మూడు నిమిషాల్లో 204 ఫుల్ స్ట్రైక్​లు చేసి రికార్డు నెలకొల్పాడు.

  • ఈ వస్తువులు మరింత చౌక..

Union Budget price rise: కేంద్ర బడ్జెట్​లో కస్టమ్స్ సుంకం కొన్ని వస్తువులపై తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. దీంతో మొబైల్ కెమెరా లెన్స్​ ధరలు తగ్గనున్నాయి. అలాగే కస్టమ్స్​ సుంకం పెంచడం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే హెడ్​ఫోన్స్, ఇయర్​ఫోన్స్​, లౌడ్ స్పీకర్ల ధరలు భారీగా పెరగనున్నాయి. బడ్జెట్ తర్వాత ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువులు చౌకగా లభిస్తాయో ఓసారి చూద్దాం.

  • స్టాక్​ మార్కెట్లకు 'బడ్జెట్​ బూస్టర్'...

Stocks Closing: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 848 పాయింట్లు లాభపడి 58,863 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 237 పాయింట్లతో 17,577 వద్దకు చేరింది.

  • 'భీమ్లా నాయక్​' బాటలో 'గని'..

Varun Tej Ghani Release Date: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. ఇందులో వరుణ్ తేజ్ నటించిన గని, 'కేజీఎఫ్​2' సహా పలు చిత్రాల విశేషాలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details