తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA

By

Published : Jan 26, 2022, 4:57 PM IST

  • దిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం...

KTR on CCI: ఆదిలాబాద్​ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణకు కృషి చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అవసరమైతే దిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగురామన్న నేతృత్యంలోని జిల్లా నాయకుల బృందం మంత్రి కేటీఆర్​ను కలిసింది. ఆదిలాబాద్‌ జిల్లా సమస్యలపై చర్చించింది. త్వరలో ఆదిలాబాద్‌కు ఐటీ టవర్ మంజూరు చేస్తామని కేటీఆర్‌ హమీ ఇచ్చారు.

  • నా ప్రాణాలకు రక్షణ లేదు..

MP Arvind Comments: తనపై జరిగిన దాడి వివరాలను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వెల్లడించారు. దాడి చేసిన వ్యక్తి.. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోలను ఎంపీ బయటపెట్టారు. దాడి జరిగిన స్థలంలో ఉన్న వ్యక్తుల వివరాలను, పేర్లను తెలియజేశారు.

  • కాకతీయుల కళపై పదేళ్లు అధ్యయనం..

Padma Shri Awardee Padmaja Reddy: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఓ కళాకారిణి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. కూచిపూడితో కళాప్రపంచంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవటం సహా.. కాకతీయుల చరిత్రను వెలుగులోకి తెచ్చి చారిత్రక నృత్య రూపకాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆమె మరెవరో కాదు.. మన కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ పద్మజారెడ్డి. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన పద్మజా రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

  • 2 కోట్ల గంజాయి పట్టివేత..

సంగారెడ్డి జిల్లాలో రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. రాజమహేంద్రవరం నుంచి నాందేడ్‌కు తరలిస్తుండగా.. సదాశివపేటలో ఏకంగా వెయ్యి కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

  • అబ్బురపరిచే గణతంత్ర విన్యాసాలు..

Republic day 2022: 73వ గణతంత్ర వేడుకలు దేశ రాజధాని దిల్లీలో అట్టహాసంగా జరిగాయి. 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలు రాజ్​పథ్​లో నిర్వహించిన కవాతులో పాల్గొన్నాయి. ఈసారి కొత్తగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 75 విమానాలతో భారత వాయుసేన విన్యాసాలు చేసింది.

  • 30ఏళ్లలో తొలిసారి జెండా రెపరెపలు..

జమ్ముకశ్మీర్​లో శ్రీనగర్​ లాల్​చౌక్​లోని క్లాక్​ టవర్​పై జాతీయ పతాకం ఆవిష్కరించారు. గత 30 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. సామాజిక కార్యకర్తలు సాజిద్ యూసఫ్​ షా, సాహిల్​ బషీర్ భట్ క్రేన్ సాయంతో క్లాక్ టవర్​పై జెండా ఎగరవేశారు.

  • చర్మంపై 21 గంటలు.. ప్లాస్టిక్​పై 8 రోజులు..

Omicron survival on surfaces: ఒమిక్రాన్​ వేరియంట్​.. చర్మంపై 21 గంటల పాటు సజీవంగా ఉంటోందని జపాన్​కు చెందిన ఓ అధ్యయనం తేల్చింది. అదే.. ప్లాస్టిక్​ వస్తువులపై 8 రోజులకుపైనే జీవించగలుగుతోందని పేర్కొంది. ఈ కారణంగా ఇతర వేరియంట్లతో పోల్చితే వేగంగా వ్యాప్తి చెందగలుగుతోందని వెల్లడించింది.

  • ఆరోగ్య రంగానికి బూస్టర్​ అవుతుందా..

Union budget 2022-23: రెండేళ్లుగా పట్టిపీడిస్తున్న కొవిడ్ మహమ్మారి దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. ఆ రంగానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని నొక్కిజెప్పింది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక పద్దులో ఆరోగ్యరంగంలో పరిశోధనలు, నవకల్పనలకు పెట్టుబడులు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రజారోగ్య వ్యవస్థకు నిర్మలమ్మ బూస్టర్‌ డోసు ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.

  • ఫాస్ట్​ బౌలింగ్​ కోచ్​గా మలింగ..

Lasith Malinga Bowling coach: శ్రీలంక జట్టు ఫాస్ట్​ బౌలింగ్​ కన్సల్టెంట్​ కోచ్​గా ఆ దేశ దిగ్గజ ఆటగాడు లసిత్​ మలింగ్​ ఎంపికయ్యే అవకాశముంది. కాగా, త్వరలో శ్రీలంక.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.

గణతంత్ర వేడుకల్లో సినీతారలు..

Republic Day: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు సినీ ప్రముఖులు. దేశంలో శాంతి, సామరస్యం ఎప్పటికీ కొనసాగాలని సూపర్​స్టార్​ మహేశ్​ బాబు ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details