తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA

By

Published : Jan 25, 2022, 4:57 PM IST

  • వైద్యరంగంలో అగ్రగామిగా నిలవటమే లక్ష్యం..

Harish Rao Launches Wanaparthy MCH: వైద్యరంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలపడమే లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. ఇవాళ వనపర్తి జిల్లా కేంద్రంలో 180 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం, 20 పడకలతో నిర్మించిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

  • ఎంపీ అర్వింద్​ వాహనంపై రాళ్ల దాడి..

TRS attack on MP Arvind : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఇస్సపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనంపై తెరాస శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఈ దాడిలో భాజపా ఎంపీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్తుండగా ఆర్మూర్ మండలం ఇస్సపల్లిలో ఈ ఘటన జరిగింది. తెరాస శ్రేణుల దాడికి నిరసనగా భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

  • నిరుద్యోగులకు బండి సంజయ్​ పిలుపు..

Bandi Sanjay On Unemploy suicide: ఖమ్మంలో నిరుద్యోగి ముత్యాల సాగర్​ ఆత్మహత్యపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ స్పందించారు. ఇకపై నిరుద్యోగులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. ప్రభుత్వంపై కలిసి పోరాడదామని యువతకు పిలుపునిచ్చారు.

  • వాళ్లు చెప్తేనే పోలీసులు వింటున్నారు..

Bhatti allegations on police:తెరాస నేతలు చెప్తేనే పోలీసులు వింటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పోలీస్ వ్యవస్థపై సమీక్షించాలని గవర్నర్​ను కోరినట్లు తెలిపారు. పోలీసుల నుంచి రక్షణ ఉంటుందనే భావన పోయిందని విమర్శించారు.

  • దేశంలో ఆ పరిస్థితి మారాలి..

PM Modi Voting Percentage: దేశంలో ఓటింగ్​ శాతం పెంపుపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 'ఒకే దేశం- ఒకే ఎన్నిక' గురించి ప్రస్తావించిన మోదీ.. లోక్‌సభ ఎన్నికల నుంచి రాష్ట్ర అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ను కనీసం 75 శాతానికి పెంచాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

  • దేశంలోనే అత్యంత పొట్టి లాయర్​..

Meenu Raheja The Shortest Lawyer: మీను రహేజా చూడటానికి చిన్నగా కనిపిస్తుంది. కానీ ఆమె ఆలోచన చాలా పెద్దది. వైకల్యాన్ని జయించి 'దేశంలోనే అత్యంత పొట్టి న్యాయవాది'గా రికార్డుకెక్కింది. బాధితుల పక్షాన చేరి వారి హక్కుల సాధనకై న్యాయస్థానంలో పోరాడుతోంది. ఆమె విజయం వెనుక ఎన్నెన్ని కష్టాలున్నాయో చూద్దామా?

  • వరుస నష్టాలకు బ్రేక్​...

Stock Market Today: స్టాక్​ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల బాట పట్టాయి. మధ్యాహ్నం సెషన్​ వరకు ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్ల దన్నుతో మెరుగుపడ్డాయి. సెన్సెక్స్​ 367 పాయింట్లు వృద్ధి చెందింది. నిఫ్టీ 129 పాయింట్లు లాభ పడింది.

  • సెమీస్​కు నాదల్​, యాష్​ బార్టీ

Austalian Open 2022: ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో భాగంగా నేడు(మంగళవారం) జరిగిన పోటీల్లో నాదల్​, యాష్​ బార్టీ అదరగొట్టారు. వీరిద్దరూ సెమీస్​కు దూసుకెళ్లారు.

  • బన్నీ మూవీ రిలీజైతే సినిమా చేయను..

Ala Vaikunthapurramuloo: ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా హిందీ వెర్షన్​ రిలీజైతే ఓ సినిమా నుంచి తప్పుకొంటానని బెదిరించారట బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్. ఇంతకీ అదే సినిమా? బన్నీ సినిమా రిలీజైతే ఆయనకేంటి ఇబ్బంది?

  • మాస్​మహారాజ్ బాలీవుడ్​ ఎంట్రీ..

Raviteja Bollywood: ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన అల్లు అర్జున్‌ 'పుష్ప' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. దీంతో టాలీవుడ్‌ హీరోలంతా హిందీ మార్కెట్‌పై కన్నేశారు. తమ తదుపరి సినిమాలు హిందీలోనూ విడుదలయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో పయనించనున్నాడు మాస్‌ మహారాజా రవితేజ.

ABOUT THE AUTHOR

...view details