ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..కరోనా నిబంధనలు కఠినతరం చేయాలి.. Telangana High Court On Corona : రాష్ట్రంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితి, ప్రభుత్వ చర్యలపై ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. మాస్కులు, భౌతిక దూరం కనిపించడం లేదన్న హైకోర్టు.. వాటిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.స్థానికులతో కేటీఆర్ క్రికెట్.. KTR Plays Cricket : పాలిటిక్స్ అయినా.. ప్లేగ్రౌండ్ అయినా నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్ అంటున్నారు రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ అంటున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో పర్యటించిన కేటీఆర్ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం తన వెంట వచ్చిన ప్రజాప్రతినిధులతో కలిసి క్రికెట్ ఆడారు. ఆ తర్వాత స్థానిక యువతతో కలిసి బాస్కెట్‌బాల్ ఆడి అదరగొట్టారు.గవర్నర్‌కు చినజీయర్ స్వామి ఆహ్వానం.. China Jiyar Meets Governor Tamilisai: ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను చినజీయర్ స్వామి ఆహ్వానించారు. రామానుజాచార్యులు భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు గట్టి షాక్.. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర ప్రముఖ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు. దేశానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ముంద్రా పోర్టులో డ్రగ్స్ కలకలం.. mundra port drug seizure: ముంద్రా పోర్టులో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. వీటి విలువ రూ.3.5 కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, బంగాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన బ్రౌన్ షుగర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సూపర్మార్కెట్లో చిన్న పిల్లాడి బేరం.. Texas woman: సూపర్మార్కెట్లో ముద్దుముద్దుగా కనిపించిన ఓ పసిపిల్లాడ్ని తనకు అమ్మేయాలంటూ తల్లిపై ఒత్తిడి తెచ్చింది ఆ మహిళ. ఏకంగా 5 లక్షల డాలర్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చింది. అందుకు నిరాకరించిన తల్లిపై దాదాపు దాడి చేసినంత పని చేసింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు.ప్రపంచంలోనే అతి సన్నటి నది Worlds narrowest river: ప్రపంచంలో అతిపెద్ద నది ఏది అని అడిగితే ఠక్కున అమెజాన్ అని చెప్పేస్తాం. మరి ప్రపంచంలోనే ఇరుకైన నది ఏదంటే.. సమాధానం చెప్పడం కష్టమే. అదెక్కడుందో, దాని పొడవెంతో తెలుసా?బడ్జెట్‌పై సామాన్యుల భారీ ఆశలు.. Budget 2022 Expectations: ఈ ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల దృష్టి అంతా దానిపైనే ఉంది. ఒకవైపు ద్రవ్యోల్బణం పెరిగి రోజువారీ ఖర్చులు భారంగా మారిన వేళ.. కరోనా రూపంలో వైద్య ఖర్చులు అదనంగా వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ కోసం ఏమైనా ఉపశమనాలు ప్రకటిస్తారన్న ఆశతో సామాన్య పన్ను చెల్లింపుదారులు వేచిచూస్తున్నారు.మాజీ క్రికెటర్ గంభీర్‌కు కరోనా.. Gautam Gambhir tests positive for Covid: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు గంభీర్. తనను కలిసిన వాళ్లు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.కొత్త సినిమాల అప్డేట్స్.. Cinema updates: కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో రవితేజ, విశాల్, ఆర్య, నాని, ప్రభుదేవా సహా పలు హీరోల చిత్రాల సంగతులు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..