ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలువిజయదశమికి ఔషధనగరి ప్రారంభం Hyderabad pharma city హైదరాబాద్‌లో ఔషధనగరి ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. ఫార్మాసిటీని దసరాకు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నెలాఖరు నాటికి మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.పురపాలికల్లో సిబ్బంది కొరతstaff Shortage in TS municipalities రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దాదాపు చాలా జిల్లాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అభివృద్ధిపైనా ప్రభావం చూపుతుండటంతో త్వరగా పరిష్కారం చూపాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.సైబర్ క్రైమ్‌లో మనమే టాప్ crime rate in Telangana 2021 దేశవ్యాప్తంగా నమోదైన పలు కేసుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. సైబర్ నేరాలు, ఆహార కల్తీ వంటి కేసుల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, ఆర్థిక నేరాల్లో రెండోస్థానం, వృద్ధులపై దాడుల్లో మూడో స్థానంలో ఉంది. 2021లో నమోదైన కేసులకు సంబంధించిన గణాంకాలను జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసింది. 2021లో రాష్ట్రంలో లక్షా 46 వేల 131 కేసులు నమోదైనట్లు వెల్లడించింది.లెక్చరర్ చేసిన పనికి.. రెండు కాళ్లు కోల్పోయిన విద్యార్థినిstudent lost legs after standing for 9 hours గురువు అంటే విద్యార్థులను తమ సొంత పిల్లలుగా చూసుకోవాలి. వారికి ఎటువంటి బాధ వచ్చినా తల్లిదండ్రులులాగా నేను ఉన్నాను అన్న ధైర్యం ఇవ్వాలి. ఏది మంచో ఏది చెడో పిల్లలకు చెప్పాలి. అంతేగాని వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించకూడదు. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిపై కర్కశంగా ప్రవర్తించిన ఘటన సాంఘిక గురుకుల కళాశాలలో చోటు చేసుకుంది.కళ్లలో కారంకొట్టి, బారికేడ్లు ఢీకొట్టి PDS Rice illegal transport రాష్ట్రంలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం ఒక అలవాటుగా మారిపోయింది. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇప్పుడు కొత్త మార్గాలను అన్వేషించి అడ్డువచ్చిన పోలీసుల పైనే కారం చల్లడం, ఛేజింగ్‌లు చేయడం వంటివి చేస్తున్నారు. అటువంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.ట్విట్ టవర్స్ కూల్చివేతతో నష్టం ఎంతో తెలుసా..?noida twin towers నోయిడాలో జంట టవర్ల కూల్చివేత వంద శాతం విజయవంతమైందని ఈ ప్రక్రియ చేపట్టిన 'ఎడిఫిస్ ఇంజినీరింగ్' సంస్థ తెలిపింది. ఆదివారం సరిగ్గా మధ్యాహ్నం 2:30 గంటలకు వాటిని కూల్చివేశారు. అంతకుముందే స్థానికులందరినీ అక్కడి నుంచి తరలించారు. ఈ జంట భవనాల కూల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారు. ఈ కూల్చివేతల ద్వారా తమ కంపెనీకి రూ.500 కోట్లు నష్టం వాటిల్లిందని సూపర్‌టెక్ ఛైర్మన్ ఆర్కే రోడా వెల్లడించారు.ట్విన్ టవర్స్ కథ అయిపోలేదు, అదే అసలు సవాల్ దేశమంతా ఎంతో ఆసక్తిగా చూస్తుండగానే నోయిడాలో అక్రమంగా నిర్మించిన ట్విన్ టవర్స్ సెకన్ల వ్యవధిలోనే నేలమట్టమైపోయాయి. దాదాపు 100 మీటర్ల ఎత్తయిన ఈ జంట భవనాలను ఉన్నచోటే అధికారులు కూల్చేశారు. ఇప్పుడు అధికారుల ముందు మరో అంశం సవాల్‌గా మారింది.జాబిలిపైకి మానవరహిత ఆర్టెమిస్ 1 ప్రయోగం నేడే50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చందమామపైకి మళ్లీ మనిషిని పంపే బృహత్తర కార్యక్రమంలో తొలి అడుగు పడనుంది. అంతరిక్షంలో సుదూర ప్రాంతాల దిశగా మానవులకు బాటలు వేయనుంది. ఆర్టెమిస్-1 పేరుతో నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళ్లనున్నాయి. చందమామను చుట్టివచ్చే ఈ స్పేస్‌షిప్‌లో వ్యోమగాములు మాత్రం ఉండరు.హార్దిక్ ఆల్‌రౌండ్ షో, కోహ్లీది మళ్లీ అదే కథ ఆసియా కప్ 2022లో భారత్ జట్టు బోణీ అదిరిపోయింది. పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్‌ను సిక్స్‌తో హార్దిక్ పాండ్య గెలుపుగా ముగించేశాడు. ఆఖరి ఓవర్‌ను పాక్ స్పిన్నర్ వేయబోతున్నాడని ముందే పసిగట్టిన హార్దిక్ హిట్టింగ్ కోసం రెడీ అయిపోయి అదరగొట్టేశాడు. అంతేకాకుండా పాక్ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసింది భువనేశ్వరే కానీ భారత బౌలర్లలో హీరో మాత్రం హార్దిక్ పాండ్యనే.లెహంగాలో మలైకా, మృణాల్ సోయగాలు చూశారాబుల్లితెర నటిగా కెరీర్‌ను ప్రారంభించి 'సూపర్ 30'తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది నటి మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత 'జెర్సీ', 'ధమాకా', 'తుఫాన్' వంటి చిత్రాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే 'సీతారామం' సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. ఈ భామ.. తాజాగా లెహంగాలో దిగిన ఫొటోలను షేర్ చేసింది. మరోవైపు, ఐటెమ్ సాంగ్స్ ఫేమ్, బాలీవుడ్ ఫిట్ అండ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా తన విషయంలో ఏజ్ అనేది జస్ట్ ఓ నంబర్ అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. ఆమె లేటెస్ట్ వైట్ లెహంగాతో ఫొటోషూట్ అదిరిపోయింది. ఓ సారి వీరిద్దరి ఫోటోలపై లుక్కేద్దాం రండి.