యాదాద్రిలో సీఎం కేసీఆర్...
సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. యాదాద్రి నరసింహున్ని దర్శించుకున్న సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాన పనులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కేటీఆర్ అభినందనలు
జేఈఈ మెయిన్స్ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన చుక్కా తనూజను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ప్రయాణికుల రైళ్లకే పార్సిల్ బోగీలు...
ప్రతీ ప్యాసింజర్ రైలుకు ఓ గూడ్స్ బోగిని అదనంగా రైల్వేశాఖ తగిలించనుంది. కరోనా నేపథ్యంలో నష్టాల్లో ఉన్న ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆదాయం పెంచుకోవడం కోసం ఇటీవలే మొదలుపెట్టిన ఉత్పత్తుల రవాణాా సత్ఫలితాలు ఇవ్వటం వల్ల... ప్రయాణికుల రైళ్లకు పార్సిల్ వ్యాన్లు జతచేయనుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
కేంద్ర మాజీమంత్రి కన్నుమూత..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం- మన్రేగాకు రూపశిల్పి, కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ ఇకలేరు. కరోనా సోకి వారం రోజులుగా దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
అఖిలపక్ష భేటీ రద్దు...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు నిర్వహించాలనుకున్న అఖిలపక్ష భేటీ రద్దయింది. కరోనా నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించటం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. రేపటి నుంచి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
రెవెన్యూ శాఖలో కొత్త పోస్టులు...
కొత్త రెవెన్యూ చట్టంతో తహసీల్దారు కార్యాలయాల్లో సేవల సంఖ్య పెరగనుంది. మరో పక్క ధరణి పోర్టల్ రాకతో అంతా డిజిటల్ భూదస్త్రాలే. రెవెన్యూ శాఖ కొత్త రూపు సంతరించుకున్న నేపథ్యంలో ఆమేరకు సిబ్బంది కూడా పెరగాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే మండలానికి పది మంది వరకు ఉన్న వీఆర్వో వ్యవస్థ రద్దయిపోయింది. తక్షణ అవసరాలకు మండలానికి కనీసం నలుగురైనా కొత్త సిబ్బంది అవసరం. దీంతో జూనియర్ అసిస్టెంట్లు లేదా జూనియర్ ఆర్‌ఐల నియామకం చేపట్టేందుకు రెవెన్యూ యంత్రాంగం సమాయత్తమౌతుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఇటాలియన్ ఓపెన్‌కు సెరెనా దూరం
యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్ వరకు వెళ్లిన సెరెనా విలియమ్స్... ఇటాలియన్ ఓపెన్‌కు దూరమైంది. గాయం కారణంగా ఈ పోటీల్లో పాల్గొనట్లేదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 14 నుంచి ఇటాలియన్ ఓపెన్ టోర్నీ ప్రారంభం కానుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
అక్షయ్‌కుమార్‌కు ముద్దిచ్చిన మహిళ
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్.. కెరీర్ ఆరంభంలో వెయిటర్‌గా పనిచేశారు. ఆనాటి సంఘటనల్ని బేర్ గ్రిల్స్ షోలో గుర్తు చేసుకున్నారు. టిప్పుగా ఓ మహిళ ముద్దు ఇచ్చిన విషయం గురించి చెప్పుకొచ్చారు ఈ స్టార్ హీరో. అక్షయ్ చేతిలో ప్రస్తుతం ‘పృథ్వీరాజ్’, ‘బెల్ బాటమ్’ చిత్రాలు ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.