తెలంగాణ

telangana

ETV Bharat / city

కంటైన్​మెంట్ జోన్​గా తిరుపతి: నగర పాలక కమిషనర్ - తిరుపతి కంటైన్​మెంట్ జోన్ వార్తలు

.

tirupathi-announced-as-containment-zone-by-municipal-commissioner
కంటైన్​మెంట్ జోన్​గా తిరుపతి: నగర పాలక కమిషనర్

By

Published : Apr 26, 2021, 6:32 PM IST

కంటైన్​మెంట్ జోన్​గా తిరుపతి: నగర పాలక కమిషనర్

కరోనా కేసుల ఉద్ధృతి దృష్ట్యా..ఏపీలోని తిరుపతిని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటిస్తున్నట్లు నగరపాలక కమిషనర్‌ గిరీషా ప్రకటించారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో కేసులు నమోదవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలల్లో దాదాపు 10వేల మందికి పాజిటివ్ నిర్ధరణ అయిందని చెప్పారు.

ఈ పరిస్థితుల్లో వైరస్ కట్టడికి ప్రజలే బాధ్యత తీసుకోవాలని గిరీషా సూచించారు. కొవిడ్ కట్టడి లక్ష్యంగా.. మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తామని ఛాంబర్‌ కామర్స్‌ స్వచ్ఛందంగా ముందుకొచ్చిందని ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి తెలిపారు. గంగమ్మ జాతర సైతం ఏకాంతంగా జరిపేందుకు ఆలయ పాలకమండలి నిర్ణయం తీసుకోవడాన్ని అభినందించారు.

ఇదీ చదవండి:1నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు ప్రమోట్‌

ABOUT THE AUTHOR

...view details