తెలంగాణ

telangana

ETV Bharat / city

30రోజుల ప్రణాళికతో "పల్లె" ప్రగతి మారుతుంది

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ తెలిపారు. గ్రామాభివృద్ధి, 30 రోజుల ప్రణాళికపై సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గ్రామాభివృద్ధి కోసం బడ్జెట్​లో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని.. వాటిని అమలు చేస్తే పల్లె ప్రగతి మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

30రోజుల ప్రణాళికతో "పల్లె" ప్రగతి మారుతుంది

By

Published : Sep 20, 2019, 1:28 PM IST


గ్రామాల దశ మార్చేందుకే 30 రోజుల ప్రణాళిక తీసుకొచ్చామన్నరు మంత్రి ఎర్రబెల్లి. గ్రామాభివృద్ధి, 30రోజుల ప్రణాళికపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. గ్రామాల్లో 7,595 డంపింగ్​ యార్డ్స్​ మంజూరు చేశామన్నారు. వీటి కోసం ప్రత్యేకంగా నిధులు విడుదలయ్యాయన్నారు. ఇంకా 12,700 గ్రామాల్లో డంపింగ్​ యార్డ్స్​ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లు ఎర్రబెల్లి తెలిపారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామంలో వీటిని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. పేదలు మరణిస్తే వైకుంఠధామం పేరుతో స్మశానవాటిక ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి కోసం బడ్జెట్​లో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని.. వాటిని అమలు చేస్తే పల్లె ప్రగతి మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

30రోజుల ప్రణాళికతో "పల్లె" ప్రగతి మారుతుంది

ABOUT THE AUTHOR

...view details