Micron Variant news Today : కొత్త వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించిందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ ప్రజలు మాత్రం ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించడం.. భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా టీకా.. మాస్కులు ధరించడంతో ఒమిక్రాన్‌ను కట్టడి చేయవచ్చని చెప్పారు.
Basti Dawakhana in Bowenpally: జీహెచ్ఎంసీ పరిధిలో బస్తీ ప్రజల జబ్బులకు జవాబుగా నిలుస్తున్న బస్తీ దవాఖానాలను ప్రభుత్వం మరింత విస్తృతం చేస్తోంది. ఇప్పుడున్న 226కు అదనంగా 32 ఆసుపత్రులను ఇవాళ అందుబాటులోకి తెచ్చింది. మొత్తం బస్తీ దవాఖానాల సంఖ్య 258కి పెరగ్గా.... ఈ నెలాఖరు లోగా మరో 7 దవాఖానాలు అందుబాటులోకి తెస్తామని ఆరోగ్యశాఖమంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లి, బాలానగర్ ఫిరోజ్‌గూడ బస్తీ దవాఖానాలను హరీశ్‌రావు ప్రారంభించారు. త్వరలో జిల్లాల్లోనూ బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగి డబ్బులు వృథా చేసుకోవద్దని బస్తీ దవాఖానాలు వినియోగించుకోవాలని సూచించారు.
Minister Harish Rao: "అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి. 18 ఏళ్లు పైబడిన వారంతా టీకా రెండు డోసులు తీసుకోవాలి. మన టీకాలు అత్యంత సురక్షితమైనవి. అపోహలు లేకుండా అందరూ టీకా వేయించుకోవాలి. టీకా తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలి. ప్రజలకు కావాల్సిన టీకా నిల్వలు ఉన్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ఆందోళన చెందొద్దు. మనరాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు లేవు. కర్ణాటకలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. విదేశాల నుంచి వచ్చేవారికి విమానాశ్రయంలో పరీక్షలు. బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళకు పాజిటివ్ వచ్చింది. మహిళ నమూనాలు జినోమ్ సీక్వెన్స్‌కు పంపాం. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఒమిక్రాన్‌ను తరిమికొట్టాలి."