తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@9AM - తెలంగాణ తాజా వార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు.

telangana top news
telangana top news

By

Published : Dec 20, 2020, 8:54 AM IST

నేడు కేసీఆర్​ సమీక్ష

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయమై సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పాతపద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బండి సంజయ్​ పర్యటన

దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఆశాజనక ఫలితాలతో భాజపాలో నూతనొత్తేజం వెల్లివిరుస్తోంది. పట్టు నిలుపుకుని ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించేందుకు కమలదళం వ్యూహాలకు పదునుపెడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జీహెచ్​ఎంసీలో ఉద్యోగాల పేరుతో మోసం

జీహెచ్‌ఎంసీతో పాటు ప్రైవేటు సంస్థల్లో తాత్కాలిక ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు సుమారు 1500 మంది నుంచి దాదాపు రూ.7 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'సీబీఐ' కాకమ్మ కథలు!

తమిళనాడు సీబీఐ కస్టడీ నుంచి ఇటీవల 103 కేజీల బంగారం అదృశ్యమైందన్న ఆరోపణల నేపథ్యంలో మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమ ప్రతిష్ఠ దిగజారుతుందని ఆక్రోశిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

చలికాలంలో ఉపరితలాలపై ఎక్కువసేపు కరోనా!

కరోనా మనుగడకు సంబంధించి అమెరికా శాస్త్రవేత్తలు కీలక పరిశోధనలు చేశారు. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్న నేపథ్యంలో ఉపరితలంపై కరోనా ఎక్కువసేపు మనుగడ సాగిస్తుందని తేల్చారు. తడి, పొడి, తేమ పరిస్థితుల్లో వైరస్ తీరుతెన్నులపై అధ్యయనాలు జరిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తొలి టీకా తీసుకున్న ప్రధాని

ఇజ్రాయెల్​లో తొలి కొవిడ్​ టీకా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకే తొలి టీకాను తీసుకున్నానని ప్రధాని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఇక మేధకు పదును!

కొవిడ్‌వల్ల గత పది నెలల కాలంలో ఆన్‌లైన్‌, మొబైల్‌ గేమ్‌ల పట్ల ఆకర్షితులైనవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. మన దేశంలో గేమింగ్‌ పరిశ్రమ ఇంకా శైశవ దశలోనే ఉంది. కానీ కొవిడ్‌ రూపంలో ఈ రంగానికి జీవం వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కాస్త ఆలోచించకపోతే.. ఖర్చయిపోతాం

కరోనా. ఆ ప్రభావంతో దాదాపు సింహభాగం వ్యక్తుల ఆదాయం తగ్గింది. వ్యయం పెరిగింది. ఇంకెంత కాలం ఉంటుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో మనల్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించి... భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులొస్తే అండగా నిలిచేది కుటుంబ ఆర్థిక ప్రణాళికేనని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

దాదాకు నెటిజన్ల అభ్యర్థన

అడిలైడ్​ టెస్టులో ఆస్ట్రేలియాపై టీమ్​​ఇండియా ఘోర పరాజయం పట్ల భారత అభిమానులు నెట్టింట తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఓటమికి ప్రధానకారణం భారత కోచ్​ రవిశాస్త్రి అని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నెటిజన్లపై ఊర్మిళ ఫైర్​

తన భర్తను ఉగ్రవాది అంటూ నెట్టింట పలువురు పోస్టులు పెట్టారని బాలీవుడ్​ నటి ఊర్మిళా మాతోండకర్​ అన్నారు. కశ్మీర్​ వ్యాపారవేత్తను వివాహమాడిన కారణంగా తన కుటుంబంపై ట్రోలింగ్​ చేస్తున్నారని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details