పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది ఆరు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ పరీక్షలు జరుపుతామని అధికారులు వెల్లడించారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల - తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్
exams
15:45 February 09
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 25 వరకు పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం ఇచ్చింది. రూ.50 ఆలస్య రుసుముతో మార్చి 3 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో మార్చి 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మార్చి 16 వరకు గడువు ఇచ్చింది.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్
క్ర.సంఖ్య | తేదీ | సబ్జెక్ట్ |
1 | మే 17 | ప్రథమ భాష |
2 | మే 18 | ద్వితీయ భాష |
3 | మే 19 | ఆంగ్ల భాష |
4 | మే 20 | గణితం |
5 | మే 21 | సామాన్యశాస్త్రం |
6 | మే 22 | సాంఘిక శాస్త్రం |
ఇదీ చదవండి :మే 1 నుంచి ఇంటర్ పరీక్షలు
Last Updated : Feb 9, 2021, 4:41 PM IST