- తెలంగాణలో కొత్త పార్టీ పెడతా..
Jaggareddy on Resign : తనపై కోవర్టును అనే ముద్ర వేశారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై బురద చల్లుతున్నందునే పార్టీని వీడాలని భావించానని చెప్పారు. తాను కాంగ్రెస్‌లో ఉంటే కొందరు ఇబ్బందిగా భావిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ బాగుండాలనే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యా అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకెళ్లినా... వేరే పార్టీలో చేరనని పేర్కొన్నారు.
- ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా క్లీన్‌స్వీప్..
ప్రజలు భాజపా నేతలపై ఎందుకు దాడి చేస్తారు ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగుల ముసుగులో తెరాస నేతలు దాడిచేస్తున్నారని ఆరోపించారు. భాజపా కార్యకర్తలు ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాలను తెరాస నేతలు ఆవిష్కరించడంపై మండిపడ్డారు.
- పంజాబ్ ఎన్నికలకు సర్వం సిద్ధం..
Punjab polls 2022: 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ప్రక్రియలో.. మరో కీలక పర్వానికి సర్వం సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్‌లో మూడో విడత, పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. యూపీలో 59 స్థానాల్లో 627 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, పంజాబ్‌లో 1,304 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
- అఫ్గాన్ సిక్కు- హిందూ ప్రతినిధులతో మోదీ భేటీ..
PM Modi: అఫ్గానిస్థాన్‌కు చెందిన సిక్కు- హిందూ సమాజ ప్రతినిధులతో తన నివాసంలో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అఫ్గాన్ నుంచి సిక్కులు, హిందువులను సురక్షితంగా భారత్‌కు తీసుకురావటంపై ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు సిక్కు ప్రముఖులు. ఓ జ్ఞాపికను అందజేశారు.
- దేశంలో ఉగ్రదాడికి భారీ కుట్ర..
NIA Raids Today: ఉగ్రదాడుల కుట్రకు సంబంధించిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జోరు పెంచింది. జమ్ముకశ్మీర్, రాజస్థాన్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సోపోర్, కుప్వారా, షోపియాన్, రాజౌరీ, బుద్గాం, గందర్‌బల్, రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు కీలక విషయాలను వెల్లడించింది.
- ముగ్గురు పోలింగ్ సిబ్బంది దుర్మరణం..