TS HC On Cars Red lights: కార్లపై ఎర్రబుగ్గను వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మోటారు వాహనాల చట్టం నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా కార్లపై ఎర్రబుగ్గ వినియోగిస్తున్నారంటూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన న్యాయవాది భావనప్ప ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. కార్లపై ఎర్రబుగ్గ వినియోగాన్ని 2017లోనే నిషేధించినా...కొందరు రాజకీయ నాయకులు, అధికారులు ఇప్పటికీ వాడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.