హెల్మెట్ ధరించకుందా.. ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న వారికి జరిమానా విధింపుపై వివరణ ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించకుండా వెనుక కూర్చున్న వారికి జరిమానాల విధింపుపై సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్ వేసిన పిల్‌పై... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
Highcourt on Fines: హెల్మెట్ లేకుండా వెనుక కూర్చున్న వారికి జరిమానాపై హైకోర్టు విచారణ
హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న వారికి జరిమానాపై హైకోర్టు విచారణ జరిపింది. సామాజిక కార్యకర్త విజయ్‌గోపాల్ దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది.
helmet
మోటారు వాహనాల చట్టం 2019 సవరణలో పిలియన్ రైడర్ ప్రస్తావన ఉందని పిటిషనర్ తెలిపారు. కేంద్ర చట్ట సవరణను రాష్ట్రం స్వీకరించక ముందే పోలీసులు జరిమానా విధిస్తున్నారని పిటిషనర్ వివరించారు. వివరాలు తెలుసుకుని చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించి తదుపరి విచారణను సెప్టెంబర్ 2కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి:ts high court: 'ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించండి'