CM KCR District Tour: సమీకృత కలెక్టరేట్ సముదాయాలు పూర్తయిన చోట ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. డిసెంబర్ నెలలోనే జిల్లాల కలెక్టరేట్ భవనాలను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. అయితే ధాన్యం కొనుగోళ్ల అంశం కారణంగా అప్పుడు జరగలేదు. ఆ కార్యాలయాలను ఇప్పుడు ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలిసింది.
వీలును బట్టి ఇతర జిల్లాల్లోనూ..
ఈనెల 11న జనగామతో కేసీఆర్ పర్యటన ప్రారంభం కానుంది. జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, తెరాస కార్యాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఆ రోజు బహిరంగ సభలోనూ ప్రసంగించనున్నారు. ఆ తరువాత వీలును బట్టి ఇతర జిల్లాల్లోనూ ప్రారంభోత్సవాలు ఉండే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి, వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్లో సమీకృత కలెక్టరేట్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు కూడా సిద్ధమయ్యాయి.