తెలంగాణ

telangana

ETV Bharat / city

ముగిసిన సమావేశాలు... 5 బిల్లులకు ఆమోదం

శాసనసభ ప్రత్యేక సమావేశాలు ముగిశాయి. కొత్త పురపాలక చట్టం బిల్లుకు ఆమోదం లభించింది. మొత్తం ఐదు బిల్లులకు సభ్యులు ఆమోదం తెలిపారు.

telangaan assembly

By

Published : Jul 19, 2019, 9:01 PM IST

కొత్త పురపాలక చట్టం బిల్లుకు ఆమోదం కోసం నిర్వహించిన శాసనసభ ప్రత్యేక సమావేశాలు ముగిశాయి. పురపాలక చట్టం బిల్లుతో పాటు ఆర్డినెన్స్​ల స్థానంలో ప్రవేశపెట్టిన మరో నాలుగు బిల్లులను ఉభయసభలు ఆమోదించాయి. రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో మొత్తం ఐదు బిల్లులకు సభ్యుల ఆమోదం లభించింది. శాసనసభ రెండు రోజుల్లో నాలుగు గంటలా 44 నిమిషాలు సమావేశమైంది. అసెంబ్లీలో 16 మంది సభ్యులు ప్రసంగించారు. శాసనమండలి ఒకరోజులో మూడు గంటలా 30 నిమిషాల పాటు సమావేశమైంది. మండలిలో 25 మంది సభ్యులు ప్రసంగించారు. బిల్లులకు ఆమోదంతో ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

ABOUT THE AUTHOR

...view details