దేశవ్యాప్తంగా మహిళల భద్రతకు హామీ ఇచ్చిన తాలిబన్లు.. వారికి నచ్చనివారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదనే సంకేతాలిస్తున్నారు. మహిళల హక్కులను కాలరాసైనా సరే కఠినమైన షరియా చట్టాలను అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో అఫ్గాన్వ్యాప్తంగా ఉన్న సెక్స్ వర్కర్ల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. వారి చట్టాల ప్రకారం సెక్స్ వర్కర్లకు మరణశిక్ష విధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతేగాకుండా వారికి నచ్చిన వారిని సెక్స్ బానిసలుగానూ వాడుకునే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
పోర్న్ సైట్లు చూసి మరీ..!
సెక్స్ వర్కర్లను గుర్తించేందుకు గాను పోర్న్ వెబ్‌సైట్స్ ద్వారా తాలిబన్లు జాబితా సిద్ధం చేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. విదేశీయులతో శృంగారంలో పాల్గొన్న మహిళలను గుర్తించి మరణశిక్ష విధించే ఆలోచనలో తాలిబన్లు ఉన్నట్లు 'ది సన్' అనే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.