కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితుల బాధలు మీడియా గుర్తించాలని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న మీడియా ప్రతినిధులు... ప్రభుత్వం వారికి ఎంతవరకు సాయం చేసిందో గమనించాలని కోరారు. అన్యాయంగా భూములు తీసుకోవడం వల్ల ... నిస్సహాయులైన నిర్వాసితుల గోడును మీడియా ప్రతినిధులు సమాజానికి చూపించాలన్నారు. ఈ ప్రాజెక్టుతో తమ ప్రాంతంలో కొత్తగా ఒక్క ఎకరం కూడా అదనంగా సాగులోకి రావడం లేదని ఎద్దేవా చేశారు.
భూ నిర్వాసితుల గోడు వినండి: ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
కాళేశ్వరం సందర్శనకు వెళ్లే మీడియా ప్రతినిధులు భూ నిర్వాసితుల బాధలు కూడా వినాలని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కోరారు. నిస్సహాయులుగా ఉన్న వారి పరిస్థితిని సమాజానికి చూపించాలని విజ్ఞప్తి చేశారు.
నిర్వాసితుల గోడు వినండి: శ్రీధర్ బాబు