తెలంగాణ

telangana

ETV Bharat / city

అవకతవకల ఆరోపణలపై ఎస్సై అభ్యర్థుల ఆందోళన

ఆర్​ఎఫ్​ఐడీ సిస్టం ద్వారా ఎస్సై పరీక్షల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 20న ఎస్సై పరీక్ష నేపథ్యంలో హైదరాబాద్​ బషీర్​బాగ్​ ప్రెస్​ క్లబ్​లో సమావేశమయ్యారు. తెజస అధ్యక్షుడు కోదండరాం, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్​ కృష్ణయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు.

హైదరాబాద్

By

Published : Apr 18, 2019, 4:31 PM IST

హైదరాబాద్ బషీర్​బాగ్​ క్లబ్​లో ఎస్సై అభ్యర్థులు సమావేశం

కానిస్టేబుల్​, ఎస్సై పోస్టుల ఎంపిక ప్రక్రియలో అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ హైదరాబాద్ బషీర్​బాగ్​ క్లబ్​లో ఎస్సై అభ్యర్థులు సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య పాల్గొన్నారు. ఆర్​ఎఫ్​ఐడీ సిస్టంలో తప్పుల వల్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు వాపోతున్నారు.
అరెస్టులు అన్యాయం
ఎస్సై పరీక్షలో అవకతవకలపై ప్రశ్నించిన అభ్యర్థులను అరెస్టు చేయడం అన్యాయమని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. పరీక్షలో అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
కొంతమందిని కావాలనే ఈవెంట్స్​లో క్వాలిఫై చేస్తున్నారని ఎస్సై అభ్యర్థులు ఆరోపించారు. ప్రశ్నిస్తే క్రిమినల్​ కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
ఎస్సై అభ్యర్థులు ఆందోళన నేపథ్యంలో బషీర్​బాగ్​ ప్రెస్​ క్లబ్​లో పోలీసులు భారీగా మోహరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details