తెలంగాణ

telangana

ETV Bharat / city

Transfer: రాష్ట్రంలో పలువురు జడ్జిల బదిలీ - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో పలువురు జడ్జిలు బదిలీ అయ్యారు. ప్రజా ప్రతినిధుల కేసులను విచారణ జరిపే ప్రత్యేక కోర్టు జడ్జి సీహెచ్​వీఆర్ఆర్. వరప్రసాద్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె.జయ కుమార్ నియమితులయ్యారు. అలాగే 15 మంది సీనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Transfer
బదిలీ

By

Published : Aug 28, 2021, 3:24 AM IST

ప్రజా ప్రతినిధుల కేసులను విచారణ జరిపే ప్రత్యేక కోర్టు జడ్జి సీహెచ్​వీఆర్ఆర్. వరప్రసాద్ బదిలీ అయ్యారు. వరప్రసాద్​ను సీబీఐ ఒకటో అదనపు ప్రత్యేక కోర్టు జడ్జిగా బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు నూతన జడ్జిగా కె.జయ కుమార్ నియమితులయ్యారు. జయ కుమార్ ప్రస్తుతం వరంగల్ జిల్లా ఒకటో అదనపు సెషన్స్ కోర్టు జడ్జిగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 మంది సీనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ సివిల్ జడ్జిల నుంచి సీనియర్ సివిల్ జడ్జిలుగా పదోన్నతి పొందిన మరో తొమ్మిది మందికి పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details