అంగన్వాడీ కేంద్రాలపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీల్లో ఇచ్చే సరుకులను ఇళ్లకే పంపిణీ చేయాలని నిర్ణయించారు. గ్రామ కమిటీల ద్వారా బియ్యం, పప్పు, నూనె, పాలు, గుడ్లు, బాలామృతం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు సెలవురోజుల్లో కూడా సరుకులు పంపిణీ చేయాలని సూచించారు.
గర్భిణీల జాబితా..
గ్రామాలు, పట్టణాల్లోని ప్రసవానికి దగ్గరగా ఉండే గర్భిణీల జాబితా సిద్ధం చేసుకుని, ఈ అత్యవసర సమయంలో వారికి ప్రభుత్వం అందించే అన్ని సేవలు లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే వారి వివరాలు తెలిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.