సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజుల పాటు సాగే ఈ పండుగలో ఆచార సాంప్రదాయాలు కళ్లకు కట్టినట్లుగా ప్రతిబింభిస్తాయి.
అందులో భాగంగా భోగి నాడు వేసే మంటల కోసం ఆవు పేడతో తయారు చేసిన పిడకల దండలను తయారు చేసేందుకు ప్రజలు పోటీపడతారు. తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలో బుచ్చమ్మ అగ్రహారానికి చెందిన 20 కుటుంబాలు.. 280 అడుగుల పొడవు గల భోగి పిడకల దండలు తయారు చేసి ఔరా అనిపించారు. వీటి కోసం 15 రోజుల నుంచి ఆవు పేడను సేకరించినట్లు పేర్కొన్నారు.