హైదరాబాద్ నగరానికి స్థానిక సంస్థగా సుదీర్ఘ చరిత్ర ఉంది. 1518 డిసెంబరు 27న కుతుబ్‌షాహీ రాజుల రాజధానిగా ఏర్పడిన గోల్కొండ పట్టణంలో ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వలాలున్నాయి. హైదరాబాద్ గతంలో చించలం అనే కుగ్రామం. భాగమతి ప్రేమకు చిహ్నంగా కులీ కుతుబ్‌షా ఇక్కడ భాగ్యనగరం నిర్మించారు. అప్పటి నుంచి అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.
విశ్వనగరంలా మారిందిలా..
*1591- అక్టోబరు 9న హైదరాబాద్ నగరం ఆవిర్భావం.
*1591 నుంచి 1868 వరకు నగరం కుతుబ్‌షాహీ, మొఘలులు, అసఫ్‌జాహీల నియంత్రణలో ఉంది.
*1866- చాదర్‌ఘాట్ బోర్డు ఏర్పడింది.
*1869- హైదరాబాద్ పురపాలక సంస్థగా మారింది.
*1933- మున్సిపాలిటీ కార్పొరేషన్ హోదా పొందింది. కార్పొరేషన్‌కు ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే హక్కు లభించింది.
*1934- తొలి మున్సిపల్ ఎన్నికలు.
*1937- జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ ఏర్పాటు.
*1942- అధికారుల మధ్య విభేదాలతో కార్పొరేషన్ రద్ధు ప్రభుత్వ అధికారి పరిపాలన.
*1950- హైదరాబాద్, సికింద్రాబాద్‌కు రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.
*1955- మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్) ఏర్పాటు.
2007- ఏప్రిల్ 16న శివార్లలోని 12 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ జీహెచ్‌ఎంసీని ఏర్పాటు చేశారు.
కార్పొరేషన్ కొత్తలో..
73 చ.కి.మీ విస్తీర్ణంలో 16లక్షల జనాభాతో ఉండేది. వార్షికాదాయం రూ.1.5కోట్లు.
జీహెచ్‌ఎంసీగా ఇప్పుడు..
625 చ.కి.మీ విస్తీర్ణంలో 78 లక్షలు జనాభాతో 6 జోన్లు, 30 సర్కిళ్లుగా ఉంది. బడ్జెట్ రూ.6వేల కోట్లు దాటింది.
మొదట్లో చార్మినార్ చుట్టూ విస్తరించిన భాగ్యనగరం ముత్యాలు, వజ్రాలు, గాజుల వ్యాపారులకు స్వర్గ ధామం. ఇప్పుడు చీరెలు, డ్రెస్‌మెటీరియల్ ప్రేమికులను ఆకర్షిస్తోంది.