హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నాంపల్లిలో ఈదురుగాలులతో వడగళ్ల వాన పడింది. బహదుర్‌పురా, జూపార్కు, పురానాపూల్, చార్మినార్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అంబర్‌పేట్, కాచిగూడ, నల్లకుంట, రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, అత్తాపూర్, కిస్మత్‌పూర్‌లో మోస్తరు జల్లులు పడ్డాయి.
రాష్ట్రంలో రాగల రెెండు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ అండమాన్ సముద్రం దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రేపు 42- 44 డిగ్రీల గరిష్ఠ ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం - రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులకు వర్షపు చినుకులు ఉపశమనం కలిగించాయి.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం