తెలంగాణ

telangana

ETV Bharat / city

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శికి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు - RRR comments on Jagan

తన ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారంటూ... కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 19, ,21 ఉల్లంఘనకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

raghurama krishna raju
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శికి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు

By

Published : Aug 16, 2020, 9:38 PM IST

తన ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు... కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్‌భల్లాకు ఫిర్యాదు చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ తన మొబైల్‌ నంబర్‌ను ట్యాప్‌ చేసిందంటూ లేఖలో పేర్కొన్నారు.

కొంతకాలంగా తన ఫోన్‌ తరచుగా అవాంతరాలకు గురవుతోందని వివరించారు. తన మొబైల్‌ను ట్యాప్‌ చేయడం ద్వారా... రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 19, ,21 ఉల్లంఘనకు పాల్పడ్డారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details