తెలంగాణ

telangana

ETV Bharat / city

'సెప్టెంబరు నెలాఖరుకు పూర్తి నియంత్రణలోకి కరోనా'

రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణలోనే ఉందని... రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గ్రేటర్​ పరిధిలో కేసులు తగ్గుముఖం పట్టాయన్న ఆయన.. సెప్టెంబర్ నెలాఖరుకు జిల్లాల్లోనూ నియంత్రణలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2 నెలలుగా పరీక్షలు పెరిగాయని... ఇప్పటివరకు 10.21 లక్షలు చేసినట్లు వివరించారు.

public health director give clarity on covid situation in state
రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాసరావు

By

Published : Aug 25, 2020, 7:21 PM IST

రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని.. సెప్టెంబరు నెలాఖరుకు పూర్తి నియంత్రణలోకి వస్తుందని ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు, వైద్యవిద్య సంచాలకులు రమేశ్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీలో కేసులు తగ్గుముఖం పట్టుతున్నాయని.. జిల్లాల్లోనూ సెప్టెంబరు నెలాఖరు వరకు అదుపులోకి వస్తుందన్నారు. ఒకసారి కరోనా సోకిన వారికి మళ్లీ వచ్చే అవకాశం చాలా తక్కువ అని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాసరావు

ప్రైవేట్ ఆస్పత్రుల్లో యాభై శాతం పడకల్లో అడ్మిషన్లను ప్రభుత్వం చేపట్టే అంశంపై చర్చలు జరుగుతున్నాయని.. త్వరలో కొలిక్కి వస్తాయని తెలిపారు. వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సీజనల్ జ్వరాలు కూడా వస్తున్నందున.. లక్షణాలపై నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించాలని శ్రీనివాసరావు, రమేశ్​ రెడ్డి సూచించారు. కరోనా చికిత్స పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులకు వెంటనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇవీ చూడండి:టీకా ఉత్పత్తిపై భారత్​తో రష్యా సంప్రదింపులు

ABOUT THE AUTHOR

...view details