తెలంగాణ

telangana

ETV Bharat / city

స్వస్థలాలకు పంపాలని పోలవరం కూలీల ఆందోళన

ఏపీలో పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పనులు లేకపోయినా 45 రోజులుగా ఇక్కడే మగ్గిపోతున్నామని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను స్వస్థలాలకు తరలించాలని ఆందోళనకు దిగారు.

'స్వస్థలాలకు తరలించాలని పోలవరం వలస కూలీలు ఆందోళన బాట'
'స్వస్థలాలకు తరలించాలని పోలవరం వలస కూలీలు ఆందోళన బాట'

By

Published : May 9, 2020, 8:23 PM IST

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా పనిచేసే కూలీలు తమ రాష్ట్రాలకు పంపాలంటూ ఆందోళన చేస్తున్నారు. సుమారు 200 మంది వలస కార్మికులు పోలవరంలో కడెమ్మ వంతెన వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికులను అడ్డుకున్నారు. 45 రోజులుగా పనులు లేక ప్రాజెక్టు ప్రాంతంలో మగ్గిపోతున్నామని కార్మికులు తమ గోడును వెల్లబోసుకున్నారు.

వెంటనే తరలించాలని ఆందోళన...

తమను స్వస్థలాలకు తరలించకుండా ఇక్కడే ఉంచుతున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రిలోగా అందరినీ కొవ్వూరు రైల్వే స్టేషన్​కు చేర్చి అక్కడ నుంచి ప్రత్యేక రైళ్లలో తమ రాష్ట్రాలకు పంపుతామని రెవెన్యూ, పోలీస్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా.. వెంటనే తరలించాలని కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

ఇవీ చూడండి : తొర్రూర్ మున్సిపాలిటీలో మంత్రి పర్యటన

ABOUT THE AUTHOR

...view details