తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆంధ్రప్రదేశ్​లో సెంచరీ కొట్టిన పెట్రోల్ - గుంటూరులో పెట్రోల్ ధర

రోజు రోజుకూ మండుతున్న చమురు ధరలు.. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా 12 వ రోజు చమురు కంపెనీలు ధరలను పెంచగా.. ఏపీలో లీటర్ ప్రీమియం పెట్రోల్ ధర వంద రూపాయలను దాటేసింది.

petrol-hits-century-in-andhrapradesh
ఆంధ్రప్రదేశ్​లో సెంచరీ కొట్టిన పెట్రోల్

By

Published : Feb 20, 2021, 9:49 AM IST

పెట్రోల్, డీజిల్‌ రేట్లు మండిపోతున్నాయి. వరుసగా 12 వ రోజు చమురు కంపెనీలు ధరలు పెంచాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో లీటర్‌ పెట్రోల్‌ రూ.100 మార్క్‌ను తాకింది.

తాజాగా ఆంధ్రప్రదేశ్​లోనూ లీటర్ పెట్రోల్ ధర సెంచరీని దాటేసింది. గుంటూరులో లీటర్ ప్రీమియం పెట్రోల్ రూ.100.13 ఉండగా.. లీటర్ సాధారణ పెట్రోల్ రూ.96.68 పైసలుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.96.48, డీజిల్ ధర రూ.90.08గా ఉంది.

ఇదీ చదవండి:ఆదిలాబాద్‌ రిమ్స్ భవనంపై నుంచి దూకిన రోగి

ABOUT THE AUTHOR

...view details