తెలంగాణ

telangana

ETV Bharat / city

Pawan kalyan: 'ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారు' - ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

Pawan kalyan: ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలకు పదో తరగతి విద్యార్థులను ఫెయిల్ చేశారని.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ప్రజలు, రైతులు, నిరుద్యోగులను ఎలానూ సంతోషపెట్టలేని ప్రభుత్వం.. కనీసం పిల్లలకు సరైన చదువైనా చెప్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దలేరా అని నిలదీశారు. గ్రేస్ మార్కులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని కోరారు.

Pawan kalyan: 'ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారు'
Pawan kalyan: 'ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారు'

By

Published : Jun 8, 2022, 2:18 PM IST

Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలకు పదో తరగతి విద్యార్థులను ఫెయిల్ చేశారని.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. గ్రేస్ మార్కులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని కోరారు. ఉచితంగా రీ-కౌటింగ్ నిర్వహించాలని.. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు తీసుకోకూడదని డిమాండ్‌ చేశారు. ప్రజలు, రైతులు, నిరుద్యోగులను ఎలానూ సంతోషపెట్టలేని ప్రభుత్వం.. కనీసం పిల్లలకు సరైన చదువైనా చెప్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దలేరా అని నిలదీశారు. విద్యార్థులు ఫెయిలైతే తల్లిదండ్రులపై నెపం వేయడాన్ని తప్పుపట్టారు.

ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే తల్లుల పెంపకం సక్రమంగా లేదని.. కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే అతను రైతేకాదని తిమ్మిని బమ్మిని చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. వైకాపా సర్కారు వాదనలు వింటుంటే.. అసహ్యం కలుగుతోందన్నారు. నాడు-నేడు పేరుతో పాఠశాలలకు రంగులేస్తున్నాం, ఇంగ్లీషులో బోధిస్తున్నాం అంటే సరిపోదని తగినంతమంది బోధన సిబ్బందిని నియమించాలని సూచించారు. అరకొరగా ఉన్న టీచర్లకు మద్యం షాపుల వద్ద డ్యూటీలు వేసిన ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశించాలని పవన్‌ ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details