చేనేత వస్త్రాల కొనుగోళ్లను ప్రోత్సహించి వాడకాన్ని పెంచేందుకు ఉద్యమంలా కృషి చేయాలని చేనేత, జౌళిశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర జౌళిశాఖ ఆధ్వర్యంలో చేనేత వస్త్రాలు, డిజైన్ల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో టీఎస్ సీఓ డిజైన్ బృందం, ఇతర రాష్ట్రాల చేనేత ఉత్పత్తుల స్టాల్లు, రాష్ట్రంలోని డిజైన్ కళాశాలలు పాల్గొంటాయి. ఇందులో ఉత్తమ డిజైనర్లకు కొండాలక్ష్మణ్ బాపూజీ అవార్డులతో సత్కరిస్తామని ఆయన ప్రకటించారు. ఆసుయంత్రం సృష్టికర్త మల్లేశం, మల్లేశం సినిమా బృందాన్ని సత్కరిస్తామని తెలిపారు. 1000 ఆసుయంత్రాల కోసం మల్లేశంతో ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. చేనేత వస్త్రాలను వినియోగించేలా ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని జయేష్ రంజన్ అన్నారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నగరంలో చేనేత వస్త్రాల ప్రదర్శన
ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో చేనేత వస్త్రాల ప్రదర్శన నిర్వహించనున్నారు.
జాతీయ చేనేత దినోత్సవాన జౌళిశాఖ చేనేత వస్త్రాల ప్రదర్శన
Last Updated : Aug 5, 2019, 10:17 PM IST