వరి రైతులు నష్టపోడానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam kumar reddy fire on CM KCR) ఉద్ఘాటించారు. ప్రభుత్వ అలసత్వం వల్లే.. ధాన్యం కొనుగోలు(paddy procurment in telangana) ఆలస్యమైందని ఆరోపించారు. దాని ఫలింతంగానే.. ఆకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న వరిదీక్ష(Congress vari Deeksha)లో పాల్గొన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తెరాస, భాజపా ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రతీ గింజను కొనాల్సిందే..
ఎంత ధాన్యం సేకరించాలో రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య ఆగస్టులోనే ఒప్పందం కుదిరినా.. కొనుగోలు విషయంలో అన్నదాతను తెరాస ప్రభుత్వం అయోమయానికి గురిచేస్తోందని ఆరోపించారు. చేతకాని ప్రభుత్వం వల్లే.. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉత్తమ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ.. రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. కేసీఆర్ చేతకానితనం వల్ల వరి రైతులు పెద్దఎత్తున నష్టపోవాల్సి వస్తోందన్నారు. వారం రోజుల పాటు కల్లాల్లోకి వెళ్లి నేరుగా రైతుల దీనస్థితి గమనించాం. తెరాస ప్రభుత్వం వచ్చాకే.. రైతులు అన్నివిధాలా నష్టపోయారన్నారు. మంత్రులకు వ్యవసాయం మీద కనీస అవగాహన లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పండిన ప్రతీ ధాన్యం గింజను కొనాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. వరి రైతుకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు.