అమెరికా వెళ్లేందుకు అనుమతి కోరుతూ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లుకౌట్ నోటీసు పెండింగ్‌లో ఉన్నందున అనుమతివ్వాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని ధర్మాసనాన్ని కోరారు. జులై రెండో వారంలో అమెరికాలో సదస్సుకు హాజరు కావాల్సి ఉందని, సదస్సు కోసం అమెరికా నుంచి ఆహ్వానం అందిందని కోర్టు దృష్టికి తెచ్చారు. అమెరికా నుంచి వచ్చిన ఆహ్వానం సమర్పించకుండా విచారణ ఎలా చేపడతామన్న న్యాయామూర్తి .. విచారణను జులై 7కి వాయిదా వేశారు.
Sujana: అమెరికా వెళ్లేందుకు హైకోర్టును ఆశ్రయించిన సుజనా చౌదరి
అమెరికాలో ఓ సదస్సుకు హజరయ్యేందుకు తనకు అనుమతినివ్వాలని కోరుతూ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. సదస్సు కోసం తనకు ఆహ్వానం అందిందని ఆయన ధర్మాసనానికి తెలిపారు. ఈ మేరకు స్పందించిన కోర్టు... ఆహ్వానం ప్రతిని సమర్పించకుండా విచారణ ఎలా చేపట్టాలని ప్రశ్నించింది. కేసు విచారణను జులై 7కు వాయిదా వేసింది.
సుజనా చౌదరికి సీబీఐ నోటీసులపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కేసులో సుజనను విచారించామని, అవసరమైతే మళ్లీ పిలుస్తామని సీబీఐ తెలిపింది. విచారణ పేరుతో మళ్లీ పిలిచే అవకాశముందని సుజన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. విచారణకు పిలిస్తే నోటీసులివ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. నోటీసులపై అభ్యంతరం ఉంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేస్తూ విచారణను ముగించింది.
ఇదీ చదవండి:తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు