రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ నిబంధనలను పలువురు వాహనదారులు పెద్ద ఎత్తున ఉల్లంఘిస్తున్నారు. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నిబంధనలు పాటించకుండా రోడ్డెక్కుతున్న వాహనదారులపై కేసులు నమోదు చేసి వారి వాహనాలను జప్తు చేస్తున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు.
లాక్‌డౌన్ ఉల్లంఘనలు.. ఏకంగా 64 వేలకు పైగా కేసులు - police files cases on lockdown violations
లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా.. కొందరిలో ఏమార్పు రావడం లేదు. కేవలం మే 12 నుంచి జులై 8 వరకు ఏకంగా 64,811 కేసులు నమోదవ్వడమే ఇందుకు సాక్ష్యం. అనుమతులు లేకుండా రోడ్లపైకి వస్తే మరింత కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్ ఉల్లంఘనలు
మే 12 నుంచి జులై 8 వరకు లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిపై ఏకంగా 64,811 కేసులు నమోదయ్యాయి. మాస్కులు ధరించని వారిపై 23,475 కేసులు నమోదు చేయగా... 22,092 వాహనాలు జప్తు చేశారు. ఎటువంటి అనుమతులు, పాస్‌లు లేకుండా రోడ్లపైకి వచ్చే వారిని ఉపేక్షించేది లేదని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇవీచూడండి:లాక్‌డౌన్ పొడిగింపుపై కేబినెట్ భేటీ