హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయకేతనం ఎగరేసిన సురభి వాణీదేవికి రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్లు అభినందనలు తెలిపారు. ప్రజలంతా కేసీఆర్ పక్షానే ఉన్నారని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయని హరీశ్ రావు అన్నారు.
రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ పక్షానే ఉన్నారు : హరీశ్ రావు
రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పక్షానే ఉన్నారని మరోసారి రుజువైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన సురభి వాణీదేవికి అభినందనలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ పక్షానే ఉన్నారు
సురభి వాణీదేవి గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి గంగుల.. ఆమెను ఆశీర్వదించిన పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు. వాణీదేవి విజయానికి తోడ్పడిన టీఎన్జీవో, ఇతర సంఘాల నేతల కృషిని కొనియాడారు.