ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా తమ ఓటు నమోదు చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. హైదరాబాద్ బన్సీలాల్ పేట డివిజన్ పరిధిలోని సర్దార్ పటేల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కార్యక్రమం, అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు.
'ప్రతీ గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలి'
హైదరాబాద్ బన్సీలాల్ పేట డివిజన్ పరిధిలోని సర్దార్ పటేల్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కార్యక్రమం, అవగాహన సదస్సులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. త్వరలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2017 సంవత్సరానికి ముందు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి గ్రాడ్యుయేట్ తమ పేర్లను ఓటరుగా నమోదు చేయించుకోవాలని మంత్రి తెలిపారు.
త్వరలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2017 సంవత్సరానికి ముందు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి గ్రాడ్యుయేట్ తమ పేర్లను ఓటరుగా నమోదు చేయించుకోవాలని మంత్రి తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని... ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
గాంధీ ఆస్పత్రికి చెందిన పలువురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అడ్వకేట్స్, పలు కాలనీలకు చెందిన గ్రాడ్యుయేట్స్ సుమారు 350 మంది ఓటరు నమోదు కోసం దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తెరాస ఇంఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ హేమలత లక్ష్మీపతి, పద్మారావు నగర్ ఇంఛార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.