సహకార శాఖ దేశంలో మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవాల్సి అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సహకార శాఖ అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని గృహకల్ప భవన్లోని సమావేశ మందిరంలో... తెలంగాణ సహకార శాఖ గెజిటెడ్ అధికారుల డైరీ ఆవిష్కరణ సభలో... మంత్రితో పాటు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాల్గొన్నారు.
సమాజ జీవనంలో సహకార శాఖ అంతర్భాగం : మంత్రి నిరంజన్ రెడ్డి
సమాజ జీవనంలో సహకార శాఖ అంతర్భాగమని మంత్రి నిరంజన్ రెడ్డి అభివర్ణించారు. సహకార శాఖ, సంఘాలు లేకుంటే రాష్ట్ర మనుగడ సాధ్యం కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో సహకార శాఖ అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు.
సహకార శాఖ, సంఘాలు లేకుంటే రాష్ట్ర మనుగడ సాధ్యం కాదని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో సహకార శాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. సమాజ జీవనంలో సహకార శాఖ అంతర్భాగమని అభివర్ణించారు. పదోన్నతులు ఉద్యోగుల హక్కులని... కానీ కోర్టు కేసుల కారణంగా ఆలస్యం అవుతోందన్నారు. సహకార శాఖలో అన్ని ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసిన అధికారులను మంత్రి అభినందించారు.
ఇదీ చదవండి :లెక్క చెప్పని నాయకులు... 40 వేల మందిపై అనర్హత