తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎల్బీనగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ - Minister KTR

మంగళవారం కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. హైదరాబాద్​లోని ఎల్బీనగర్ డివిజన్​లోని బైరామల్ గూడలోని మంత్రి కేటీఆర్ అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని అధైర్యపడ్డొదని హామీ ఇచ్చారు.

Minister KTR visiting flood affected areas
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్

By

Published : Oct 14, 2020, 3:07 PM IST

ఎల్బీనగర్ బైరామల్ గూడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. హోంమంత్రి, సీఎస్, డీజీపీతో కలిసి వరద ప్రాంతాల్లోని పరిస్థితులను పర్యవేక్షించారు. నీరు త్వరగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. బైరామల్ గూడ కాలనీ సమస్యలపై ప్రజలతో మాట్లాడిన... కేటీఆర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లకు సూచనలు చేశారు. ప్రజలు తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రికి విన్నవించుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details