రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే దక్షిణకొరియా కంపెనీలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దక్షిణకొరియా పారిశ్రామిక వర్గాలు, భారతా-దక్షిణకొరియా రాయబారులు, పలు రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో.. ఇండియా కొరియా బిజినెస్ ఫోరం నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా వివరించారు. తమ పారిశ్రామిక విధానాల ద్వారా గత ఆరేళ్లలో సుమారు 30 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని కేటీఆర్ తెలిపారు. కొరియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత టెక్స్టైల్ దిగ్గజ కంపెనీ యంగ్వన్.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. ఇప్పటికే తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ డివైస్ పార్క్ ద్వారా కొరియాలోని గంగ్ వన్ టెక్ పార్క్‌తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు.