హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆరోగ్య శ్రీ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఒక్కో డయాలసిస్ రోగికి నెలకు లక్షా 20వేల నుంచి లక్షా 50వేల వరకు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. తెరాస ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత బాధితురాలు కాబట్టే కంటతడి పెట్టుకున్నారని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి... డయాలసిస్ బాధితులకు సాయం అందించే ప్రయత్నం చేస్తామని ఈటల హామీ ఇచ్చారు.
బాధితురాలు కాబట్టే సునీత కన్నీరు పెట్టుకున్నారు: మంత్రి ఈటల
రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాలను, యంత్రాలను పెంచుతామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బాధితులకు సాయం చేసే అంశంపై సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
మంత్రి ఈటల రాజేందర్