తెలంగాణ

telangana

ETV Bharat / city

'మేం తలుచుకుంటే లోకేశ్​పై కేసు పెట్టలేమా?'

ఆంధ్రప్రదేశ్​లో రాజకీయ దురుద్దేశంతోనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులపై తెదేపా నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

minister-anil-yadav-sensational-comments-on-tdp
'మేం తలుచుకుంటే లోకేశ్​పై కేసు పెట్టలేమా?'

By

Published : Jan 16, 2021, 9:52 PM IST

కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం మత సామరస్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్​ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ అన్నారు. ఏపీలో దేవాలయాలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ స్పష్టంగా వివరణ ఇస్తే.. తెదేపా బెంబేలెత్తిపోతోందని విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.

ఒక్కరోజులోనే డీజీపీ మాట మార్చారని తెదేపా నేతలు అంటున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు విచారణ చేయాలి. తెదేపా హయాంలో ఏ ఘటన జరిగినా వైకాపా కార్యకర్తల పని అని అప్పటి డీజీపీ చెప్పేవారు. అదేవిధంగా మేము ప్రవర్తిస్తే 29 ఘటనలు తెదేపా వారి పనే అని చెప్పేవాళ్లం కదా. తొమ్మిది కేసుల్లో మాత్రమే ప్రతిపక్ష పార్టీ హస్తం ఉందని చెప్పాం. కొన్నింటిలో భాజపా వారి ప్రమేయం ఉందని చెప్పాం. మేం తలుచుకుంటే వీటి వెనుక నారా లోకేశ్ ఉన్నారని కేసు పెట్టలేమా?

- అనిల్ కుమార్ యాదవ్, జలవనరుల శాఖ మంత్రి

'మేం తలుచుకుంటే లోకేశ్​పై కేసు పెట్టలేమా?'

ఇదీ చదవండి:గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి: సీఎస్

ABOUT THE AUTHOR

...view details