Rain Alert: అండమాన్ ఆ పరిసర ప్రాంతాల్లో సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండం మారే అవకాశం ఉందని వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో వాయుగుండం తుపానుగా బలపడుతుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ డిసెంబరు 4 నాటికి ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశాల మధ్య తీరాన్ని దాటే అవకాశమున్నట్టు తెలియజేసింది.
Rain Alert: స్థిరంగా అల్పపీడనం.. 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం!
Rain Alert: అండమాన్ ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
దీని ప్రభావంతో ఈనెల 3 నుంచి ఉత్తర కోస్తాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. కోస్తాంధ్ర తీరప్రాంతంలోని మత్స్యకారులు రాగల రెండు రోజుల్లో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచనలు చేసింది. పోర్టులకూ అప్రమత్తత హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉభయ గోదావరి, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు చెందిన రైతులు పంటలను కాపాడుకొనేందుకు చర్యలు తీసుకోవాలని సూచనలు జారీచేశారు.
ఇదీచూడండి:Car fell into well in Siddipet: బావిలో పడిన కారు.. నీటిలోనే తల్లి, కుమారుడు!