తెలంగాణ

telangana

ETV Bharat / city

స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్​కు వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల మద్దతు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న నాగేశ్వర్​కు వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఆయన ఎంతో కృషి చేశారని రాష్ట్ర యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు వెల్లడించారు.

స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్​కు వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల మద్దతు
స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్​కు వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల మద్దతు

By

Published : Feb 25, 2021, 3:23 PM IST

హైదరాబాద్​-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రొఫెసర్ కె.నాగేశ్వర్​కు మద్దతు ఇచ్చి ఓట్లు వేయాలని రాష్ట్ర యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ కోరింది. హైదరాబాద్ రాంనగర్ రిసాల గడ్డలోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో యూనియన్ సమావేశం జరిగింది. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రొఫెసర్ నాగేశ్వర్ పోరాడుతున్నారని... ఎమ్మెల్సీగా ఉన్నా ప్రభుత్వానికి తన వాణిని గట్టిగా వినిపించారని అధ్యక్షుడు భూపాల్ తెలిపారు.

బడ్జెట్ కేటాయింపులు, ఉద్యోగాల భర్తీ, మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల జీతభత్యాలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ కోసం నిరంతరం కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాగేశ్వర్​కు ఓటు వేసి గెలిపించాలని ఆయన విన్నవించారు.

ఇదీ చదవండి: సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయొద్దు: జానారెడ్డి

ABOUT THE AUTHOR

...view details