తెలంగాణ

telangana

ETV Bharat / city

కాండానికి గుత్తులుగా కాసిన మామిడి కాయలు

మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. అదే కాండానికి కాచి అవి కూడా గుత్తులుగా ఉంటే? వీక్షించేందుకు భలే ఆసక్తిగా ఉంటుంది కదూ! తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని గూడపల్లి గ్రామంలో సుందర రామ సుధాకర్ ఇంటి ఆవరణలో ఈ వింత జరిగింది.

ఏపీ రాజోలులో కాండానికి గుత్తులుగా కాచిన మామిడి
ఏపీ రాజోలులో కాండానికి గుత్తులుగా కాచిన మామిడి

By

Published : May 10, 2020, 8:45 PM IST

ఏపీ తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం గూడవల్లిలోని సుందర రామ సుధాకర్​ ఇంట్లో మామిడి కాయలు కాండానికి కాచాయి. సాధారణానికి భిన్నంగా కాయడంతో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. చెరకు రసాల మామిడి చెట్టు కాండం అడుగుభాగంలో గుత్తులు గుత్తులుగా కాచి చూపరులను అబ్బురపరుస్తున్నాయి. ఆ కాయలు చూస్తే... నేల మీద నుంచి వచ్చినట్లు ఉన్నాయి. గుత్తులుగా ఉన్న ఆ కాయలు పడిపోకుండా వాటికి కర్ర పుల్లలను సాయంగా పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details