Man Beaten by cops:ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఓ చోరీ కేసులో అనుమానంతో చల్లా సుబ్బారావు అనే యువకుడిని గ్రామీణ పోలీసులు బుధవారం స్టేషన్కు తీసుకువచ్చారు.
అయితే విచారణ పేరుతో పోలీసులు చావబాదారని.. దెబ్బలు తట్టుకోలేక భవనం పైనుంచి దూకానని బాధితుడు వాపోయాడు. పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నానని చెప్పినా వినలేదని.. తీవ్రంగా కొట్టాడని బాధితుడు ఆరోపించాడు. తీవ్ర గాయాలైన సుబ్బారావును మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని ఆస్పత్రికి పోలీసులు తరలించారు.