తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీశైలం అగ్ని ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలి: రేవంత్

శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి... మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్​సభలో ప్రస్తావించారు. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే... ప్రమాదం జరిగినట్టు తెలిపారు.

malakajigiri mp revanth reddy about srisailam fire accident in parliament
శ్రీశైలం అగ్ని ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలి: రేవంత్

By

Published : Sep 16, 2020, 4:42 PM IST

శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్​ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని... మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పార్లమెంటులో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే... ఆగస్టు 20న అగ్ని ప్రమాదం జరిగినట్టు ఆరోపించారు. ఆ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను... ముఖ్యమంత్రి పరామర్శించకపోగా... కనీసం భరోసా కూడా ఇవ్వలేదని విమర్శించారు.

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్​ సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్వహణకు... ప్రభుత్వం నిధులు కేటాయించలేదని వివరించారు. 900 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి చేసే ఆ ప్రాజెక్టు... వందల కోట్ల ఆస్తులు కలిగి ఉందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1500 కోట్లు ఆదాయం వస్తోందని రేవంత్​ వివరించారు.

శ్రీశైలం అగ్ని ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలి: రేవంత్

ఇదీ చూడండి:సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details